Anantapur : ప్రేమ పేరుతో మోసం.. యువతి సూసైడ్.. కటకటాల్లో ఎస్‌ఐ
Anantapur : ప్రేమ పేరుతో యువతుల్ని ట్రాప్ చేస్తూ మోసం చేస్తున్న SI చివరికి కటకటాల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.;
Anantapur : ప్రేమ పేరుతో యువతుల్ని ట్రాప్ చేస్తూ మోసం చేస్తున్న SI చివరికి కటకటాల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. అనంతపురం జిల్లా పామిడి మండలం జీఏ కొట్టాలకు చెందిన డిగ్రీ విద్యార్థిని సరస్వతి సూసైడ్‌కి కారణమైన చంద్రగిరి ఎస్‌ఐ విజయ్ కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతనిపై గతంలో దిశ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా ఉంది. ఆ కేసులో నుంచి బయటపడేందుకు ఫిర్యాదు చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.
ఆ తర్వాత కూడా బుద్ధి పోనిచ్చుకోలేదు. తిరుపతిలో డిగ్రీ చదువుతున్న సరస్వతిని ట్రాప్ చేశాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి మొహం చాటేశాడు. మోసంతో తనకు దగ్గరై, చివరికిలా వంచించిన తీరును తట్టుకోలేక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. దీనిపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు SI విజయ్ కుమార్‌ను అరెస్టు చేశారు.
అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి తరలించినట్టు తాడిపత్రి డీఎస్పీ చైతన్య చెప్పారు. గతంలోనూ ప్రేమ పేరుతో యువతులను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని డీఎస్పీ అన్నారు.