Corporator Murdered : కాకినాడలో కార్పొరేటర్ కంపర రమేశ్ దారుణ హత్య ..!
Corporator Murdered : కాకినాడలో ఓ కార్పొరేటర్‌ను దారుణంగా హత్య చేశారు. కారుతో ఢీకొట్టి మరి చంపేశారు. పాత కక్షల కారణంగానే కార్పొరేటర్ కంపర రమేశ్‌ను హతమార్చారని అనుమానిస్తున్నారు.;
Corporator Murdered : కాకినాడలో ఓ కార్పొరేటర్‌ను దారుణంగా హత్య చేశారు. కారుతో ఢీకొట్టి మరి చంపేశారు. పాత కక్షల కారణంగానే కార్పొరేటర్ కంపర రమేశ్‌ను హతమార్చారని అనుమానిస్తున్నారు. కంపర రమేశ్‌ను కారుతో ఢీకొట్టి చంపిన విజువల్స్ సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. కాకినాడ రూరల్ వలసపాక కార్పొరేటర్ అయిన కంపర రమేశ్‌కు.. రెవెన్యూ కాలనీకి చెందిన చిన్న రమేశ్ ఫోన్ చేశారు. తాను వలసపాకలోనే ఉన్నానని కంపర రమేశ్ చెప్పడంతో... చిన్న రమేశ్ అతని సోదరుడు కారులో అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో చిన్న రమేశ్, కార్పొరేటర్ రమేశ్ మధ్య గొడవ జరిగింది. ఆ తరువాత కార్పొరేటర్ రమేశ్‌ను కావాలనే కారుతో ఢీకొట్టి అతని మీద నుంచి మూడుసార్లు కారును పోనిచ్చారు. తీవ్రగాయాలైన రమేశ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయారు.