పల్నాడు జిల్లా దాచేపల్లిలో దారుణహత్య జరిగింది. ఓ వ్యక్తిని గొడ్డలితో నరికి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.డెడ్‌బాడీని దాచేపల్లి నగర శివార్లలలో ఉన్న మోడల్ స్కూల్ దగ్గర్లో ఉన్న ఓ మిర్చితోటలో దగ్ధం చేశారు. మృతుడుని దాచేపల్లి నగర పంచాయితీతో పంప్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కోటేశ్వరరావుగా గుర్తించారు పోలీసులు. వివాహేతర సంబందమే హత్యకు కారణమంటున్నారు పోలీసులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కూడా అదే నగర పంచాయితీలో పనిచేస్తున్న మరో పంప్ ఆపరేటర్‌గా గుర్తించారు పోలీసులు .