Delhi liquor Scam: మనీష్ సిసోడియాకు హైకోర్టు షాక్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు హైకోర్టు షాక్ ఇచ్చింది;
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు హైకోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ నమోదు చేసిన కేసులో సిసోడియాపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని.. బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. సిసోసిడియా బయటికి వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయన్న వాదనలో కోర్టు ఏకీభవించింది. సిసోడియాపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని కోర్టు వ్యాఖ్యానించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాకు.. జూన్ 1 వరకు రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ పొడిగించింది. అయితే ఇదే కేసులో అటు ఈడీ కూడా సిసోదియాపై కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకుంది. సిసోడియా బెయిల్ పిటిషన్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అయితే హైకోర్టు తీర్పుపై సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని ఆప్ వర్గాలు వెల్లడించాయి.