Crime News: యజమాని ఇంట్లో రూ.8 కోట్లు చోరీ.. పనిమనిషి నిర్వాకం

Crime News: ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలియట్లేదు.. ఇంట్లో మనిషిలా కలిసిపోయాడని అంతా అనుకున్నారు.. తీరా చూస్తే రూ.8 కోట్లు దొంగిలించాడు.

Update: 2022-07-29 06:45 GMT

Crime News: ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలియట్లేదు.. ఇంట్లో మనిషిలా కలిసిపోయాడని అంతా అనుకున్నారు.. తీరా చూస్తే రూ.8 కోట్లు దొంగిలించాడు. పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలోని యజమాని ఇంట్లో ₹ 8 కోట్ల విలువైన నగదు మరియు నగలు దొంగిలించినందుకు గాను పనిమనిషిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని బీహార్‌కు చెందిన మోహన్‌కుమార్‌ (26)గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 4న తన కుటుంబ సభ్యులతో కలిసి ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు అమెరికా వెళ్లారు. గత ఐదేళ్లుగా పనిమనిషిగా పనిచేస్తున్న కుమార్‌కు ఇల్లు అప్పగించి వెళ్లారు. ఇదే అదనుగా భావించాడు. యజమాని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు.. బుద్ది గడ్డితిని చోరీకి పాల్పడ్డాడు. బంధువుతో కలిసి తిన్న ఇంటికి కన్నం వేశాడు. భారీ ఎత్తున డబ్బు బంగారం సూట్ కేసుల ద్వారా తరలించాడు.

అమెరికా నుంచి తిరిగి వచ్చిన కుటుంబసభ్యులు ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. కుమార్‌పై ఏ మాత్రం అనుమానం వ్యక్తం చేయలేకపోయారు. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా కుమార్ చోరీకి పాల్పడ్డ విషయం అర్థమైంది. అతడిని అతడికి సహకరించిన బంధువుని అదుపులోకి తీసుకుని నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. కుమార్‌ని, అతని బంధువుని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

Tags:    

Similar News