Ongole Murder : మహిళపై నాటు వైద్యుడు అత్యాచారయత్నం.. ప్రతిఘటించడంతో గొడ్డలితో నరికి..!
Ongole Murder : ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. జరుగుమల్లి మండలం కామేపల్లిలో మహిళపై లైంగిక దాడికి యత్నించి ఆమె ప్రతిఘటించడంతో కిరాతకంగా హత్యచేశాడు;
Ongole Murder : ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. జరుగుమల్లి మండలం కామేపల్లిలో మహిళపై లైంగిక దాడికి యత్నించి ఆమె ప్రతిఘటించడంతో కిరాతకంగా హత్యచేశాడు నాటు వైద్యుడు గోపిశెట్టి. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు నాటు వైద్యుడ్ని కర్రలతో కొట్టి చంపారు. పంటి వైద్యం కోసం నాటు వైద్యుడు వద్దకు మహిళ వెళ్లింది. ఇదే సమయంలో మహిళపై నాటు వైద్యుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మహిళ ప్రతిఘటించడంతో ఆమెను కిరాతకంగా హత్య చేశాడని చెప్తున్నారు.