Koti Fire Accident : కోఠి బ్యాంక్‌స్ట్రీట్‌లో అగ్ని ప్రమాదం..
Koti Fire Accident : హైదరాబాద్ కోఠి బ్యాంక్‌స్ట్రీట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది;
Koti Fire Accident : హైదరాబాద్ కోఠి బ్యాంక్‌స్ట్రీట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్పోర్ట్స్ షాప్‌కు చెందిన గోదాంలో మంటలు చెలరేగి సామాగ్రి అంతా అగ్నికి ఆహూతి అయ్యింది. మూడో అంతస్తులో ఉన్న గోదాంలో.. ఒక్కసారిగా మంటలు అంటుకోవటంతో...స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గోదాంలోని మంటల్లో చిక్కుకున్న నలుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. క్రీడాసామాగ్రి పూర్తిగా దగ్ధంకావటంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు దుకాణదారులు చెబుతున్నారు.