ట్యాంక్‌బండ్ వద్ద కలకలం.. ఆత్మహత్యకు యత్నించిన ఐదుగురు మహిళలు..!
ఆర్థిక సమస్యలతో ఓమహిళ .. ప్రేమ విఫలమైందని ఓయువతి.. కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించారు.;
ట్యాంక్‌బండ్ హుస్సెన్ సాగర్ వద్ద ఒకేరోజు ఐదుగురు ఆత్మహత్యకు యత్నించారు. ఆర్థిక సమస్యలతో ఓమహిళ .. ప్రేమ విఫలమైందని ఓయువతి.. కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఐదుగురిని కాపాడారు. అనంతరం వీరందరికి కౌన్సిలింగ్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించ్చారు. ఇలా ఒకే రోజు ఐదుగురు మహిళలు ఆత్మహత్యకు యత్నించడం ట్యాంక్‌బండ్ వద్ద కలకలం రేపింది.