ఆ బాధ తట్టుకోలేక దంపతుల సహా కొడుకు, కూతురు మృతి
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.;
ప్రైవేట్ అప్పులకు ఎన్నో కుటుంబాలు బలవుతునే ఉన్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కెపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ తట్టుకోలేక.. ఇంట్లో ఉరి వేసుకున్నారు. ఇద్దరు దంపతులు సహా... కొడుకు, కూతురు మరణించారు. ఈ ఘటనతో మల్కెపల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
అప్పులు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడ సూసైడ్ లెటర్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భర్త జంజీరాల రమేష్, భార్య పద్మ, కొడుకు అక్షయ్, కూతురు సౌమ్యలు మరణించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.