రెండు రోజుల్లో పెళ్లి ఉందనగా వరుడు మిస్సింగ్‌..!

రెండు రోజుల్లో పెళ్లి ఉందనగా వరుడు అదృశ్యమైన ఘటన SR నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

Update: 2021-12-16 08:30 GMT

రెండు రోజుల్లో పెళ్లి ఉందనగా వరుడు అదృశ్యమైన ఘటన SR నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం బుట్టాయిగూడెంకు చెందిన సత్యనారాయణ అలియాస్‌ నాని కనిపించకుండాపోయాడు. ఈ నెల 17న పెళ్లి జరగాల్సి ఉంది. సత్యనారాయణ ఓ ప్రైవేట్‌ బ్యాంకులో పని చేస్తున్నాడు. ఈ నెల 13వ తేదీన KPHB కాలనీలో బస్సు ఎక్కినట్లు గుర్తించారు. తర్వాత ఆచూకీ లేకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News