Delhi : ఢిల్లీ అంతర్జాతీయ కార్గోలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.434 విలువైన హెరాయిన్ సీజ్
Delhi : ఢిల్లీ అంతర్జాతీయ కార్గోలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు. 434 కోట్ల విలువైన 54 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు డీఆర్‌ఐ అధికారులు.;
Delhi : ఢిల్లీ అంతర్జాతీయ కార్గోలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు. 434 కోట్ల విలువైన 54 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు డీఆర్‌ఐ అధికారులు. ఉగాండా నుంచి ఢిల్లీ వచ్చిన ఓ భారీ పార్శిల్‌లో హెరాయిన్ గుర్తించారు. అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా తెల్లటి హెరాయిన్‌ను ట్రాలీ బ్యాగుల కింద దాచి తరలించే ప్రయత్నం చేశారు కేటుగాళ్లు. ఒకటి కాదు రెండు కాదు 126 ట్రాలీ బ్యాగుల్లో హెరాయిన్ దాచారు స్మగ్లర్లు. ఢిల్లీకి పార్శిల్ ద్వారా 330 కొత్త ట్రాలీ బ్యాగులను పంపించారు. ఆ సమయంలో 126 బ్యాగుల్లో హెరాయిన్ దాచి కొత్త పంథాలో స్మగ్లింగ్‌కు తెరలేపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.