Hyderabad Murder : పెళ్లయిన నెల రోజులకే.. భార్యను హత్య చేసి.. భర్త ఆత్మహత్యాయత్నం ..!
Hyderabad Murder : హైదరాబాద్ ప్రగతినగర్‌లో ఓ వ్యక్తి ఉన్మాదిలా మారిపోయాడు. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఆమె గొంతు కోసి చంపేశాడు.;
Hyderabad Murder : హైదరాబాద్ ప్రగతినగర్‌లో ఓ వ్యక్తి ఉన్మాదిలా మారిపోయాడు. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఆమె గొంతు కోసి చంపేశాడు. పెళ్లయిన నెల రోజులకే భార్యపై అంత అనుమానం ఎందుకు పెంచుకున్నాడో, ఎందుకు ఇంత ఘోరానికి పాల్పడ్డాడో అర్థంకాక యువతి తల్లిదండ్రులైతే షాక్‌లో ఉన్నారు. కత్తితో సుధారాణి గొంతు కోసిన కిరణ్.. తర్వాత తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. తన చేతిని కత్తితో కోసుకున్నాడు. ప్రస్తుతం అతన్ని నిజాంపేటలోని హోలిస్టిక్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేవలం అనుమానంతోనే కిరణ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిసి అమ్మాయి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి పోలీసులు.. నవ వధువు హత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. కిరణ్ ఇంటికి వెళ్లి కొన్ని క్లూస్ సేకరించారు.