ఆడపిల్లల జోలికి వస్తే శిక్ష ఎలా ఉంటుందో తుని ఘటన చూస్తేనే అర్థం అవుతోంది. వావి వరసలు మర్చిపోయి ఇప్పటి సమాజంలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు కొందరు దుర్మార్గులు. అభం, శుభం తెలియని చిన్నారులను తీసుకెళ్లి అఘాయిత్యాలు చేస్తుంటే.. శిక్ష కచ్చితంగా పడుతుంది. ఆ దేవుడు వివిధ రకాలుగా శిక్షలు వేస్తూనే ఉంటాడు. తప్పులు చేస్తున్న దుర్మార్గులకే పశ్చాత్తాపం అనిపించి సూసైడ్ చేసుకునేలా చేస్తాడు ఆ భగవంతుడు. లేదంటే సదరు నిందితులు పొరపాటున చేసే పనుల వల్ల కూడా ప్రాణాలు కోల్పుతుంటారు. లేదంటే మరో రకంగా ఇంకో మనిషి ద్వారా శిక్షించబడతాడు. కామంతో కళ్లు మూసుకునిపోయి చేసే అరాచకాలకు ఇలాంటి శిక్షలు తప్పవు.
ఇప్పుడు తుని ఘటనలో జరిగింది కూడా ఇదే. మైనర్ బాలికపై నారాయణ రావు కన్నేశాడు. పాపం ఆ బాలికకు తండ్రి లేడు. తల్లి మాత్రమే ఉంది. దాంతో ఆ బాలిక ఇంటి దగ్గర్లోనే ఉండే నారాయణ రావు ఆ పాపను చెరపట్టాలని చూశాడు. ఇప్పటికే రెండు, మూడు సార్లు గురుకుల పాఠశాల నుంచి బాలికను తీసుకెళ్లాడు. ఇప్పుడు మరోసారి అలాగే తీసుకెళ్లి ఓ తోటలో అత్యాచారం చేయబోతుంటే తోట యజమాని చూసి పట్టుకున్నాడు. బాలికను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ కామాంధుడు నారాయణ రావు మాత్రం రెచ్చిపోయాడు. రకరకాల కారణాలు చెబుతూ దబాయించే ప్రయత్నం చేశాడు. టీడీపీ మాజీ కార్యకర్త అంటున్నారు. ఇక్కడ ఏ పార్టీ అయినా సరే అమ్మాయిల జోలికి వస్తే కఠినంగా శిక్షలు తప్పవు.
అతన్ని పార్టీతో చూడొద్దు. అతడు ఒక నిందితుడు. అక్కడి వరకు మాత్రమే చూడాలి. అందుకే అతనికి శిక్ష దేవుడే బలంగా వేసేశాడు. కోర్టు అతనికి రిమాండ్ విధిస్తే పోలీసులు జైలుకు తీసుకెళ్తున్న టైమ్ లో వాష్ రూమ్ అంటూ దిగాడు. జోరుగా వాన పడుతుంటే పోలీసులు పక్కనే ఉన్న చెట్టు దగ్గర నిలబడ్డారు. ఇంతలోనే నీటిలో నుంచి పెద్ద శబ్దం వచ్చింది. కాలుజారి పడ్డాడో లేదంటే ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదు గానీ.. నారాయణ రావు శవమైపోయాడు. ఇదంతా చూసి అయినా ఇలాంటి కీచకులకు బుద్ధి రావాలి. ఎందుకంటే చిన్నారు జోలికి వస్తే దేవుడు గట్టి శిక్ష వేస్తాడని ఈ ఉదంతం చూసి అయినా మారిపోవాలి.