Vasavi Real Estate: వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్స్‌పై ఐటీ దాడులు..
Vasavi Real Estate: వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్స్‌పై ఐటీ అధికారులు దాడులు చేశారు.;
Vasavi Real Estate: వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్స్‌పై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఏపీ, తెలంగాణలో ఒకే సారి 20 చోట్ల దాడులు చేశారు. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని వాసవి గ్రూప్స్ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వేల కోట్లు పనులు చేస్తూ... ఇన్‌కం ట్యాక్స్ చెల్లించడంలో అవకతవకలకు పాల్పడినట్లు వాసవి గ్రూప్స్‌పై అరోపణలు ఉన్నాయి. దీంతో అక్రమ లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.
వాసవి రియాల్టీ, వాసవి నిర్మాన్, శ్రీముఖ్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, ఇండ్మాక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వాసవి ఫిడల్ వెంచర్స్ పేర్లతో సంస్థలు నడిపిస్తున్నాయి. ప్రస్తుత ఆరోపణల నేపథ్యంలో వాసవి గ్రూప్స్ ఇప్పటివరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు, ఇంకా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వివరాలను ఐటీ అధికారులు తెలుసుకుంటున్నారు. ప్రీలాంచ్ ఆఫర్లతో వాసవి గ్రూప్ వేగంగా విస్తరించింది. ప్రీలాంచ్ ఆఫర్ల ద్వారా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వాసవి గ్రూప్ సమీకరించింది. ప్రీలాంచ్ ఆఫర్ల కారణంగానే ఐటీ శాఖ ఈ దాడులు నిర్వహిస్తోంది.