TG: తెలంగాణలో తగ్గిన నేరాల సంఖ్య: డీజీపీ

గతే­డా­ది 2,34,158 కే­సు­లు నమో­దు

Update: 2025-12-30 09:00 GMT

తె­లం­గా­ణ­లో శాం­తి­భ­ద్ర­త­లు పూ­ర్తి­గా అదు­పు­లో ఉన్నా­య­ని డీ­జీ­పీ శి­వ­ధ­ర్ రె­డ్డి అన్నా­రు. గతే­డా­ది­తో పో­లి­స్తే రా­ష్ట్రం­లో  నే­రాల సం­ఖ్య 2.33 శాతం తగ్గిం­ద­ని ఆయన వె­ల్ల­డిం­చా­రు. తె­లం­గాణ పో­లీ­స్ వా­ర్షిక ని­వే­దిక-2025 ను ఆయ­నఈ­రో­జు వి­డు­దల చే­శా­రు. ఈ సం­ద­ర్భం­గా ఆయన మా­ట్లా­డు­తూ గతే­డా­ది 2,34,158 కే­సు­లు నమో­దు అయి­తే 2025 సం­వ­త్స­రం­లో 2.28,69 కే­సు­లు నమో­ద­య్యా­య­ని తె­లి­పా­రు. బీ­ఎ­న్ఎ­స్ కే­సు­లు 2024 లో 1,69,477 నమో­దు అయి­తే 2025లో 1,67,018 కే­సు­లు నమో­దు అయ్యా­య­ని ఇవి గతే­డా­ది­తో పో­లి­స్తే 1.45 శాతం తగ్గి­న­ట్లు తెలంగాణ డీజీపీ వె­ల్ల­డిం­చా­రు.

గతేడాది 2 లక్షలకుపైగా కేసులు

గతే­డా­ది 2,34,158 కే­సు­లు నమో­దు అయి­తే 2025 సం­వ­త్స­రం­లో 2.28,69 కే­సు­లు నమో­దు అయ్యా­య­ని తె­లి­పా­రు. బీ­ఎ­న్ఎ­స్ కే­సు­లు 2024 లో 1,69,477 నమో­దు అయి­తే 2025లో 1,67,018 కే­సు­లు నమో­దు అయ్యా­య­ని ఇవి గతే­డా­ది­తో పో­లి­స్తే 1.45 శాతం తగ్గిం­ద­ని తె­లి­పా­రు. నేర ని­రూ­పణ శాతం 3.09 శాతం పె­రి­గిం­ద­ని ఇది గతే­డా­ది 35.63 శాతం ఉంటే ఈ ఏడా­ది 38.72 శాతం ఉం­ద­ని తె­లి­పా­రు. ఈ ఏడా­ది నా­లు­గు కే­సు­ల్లో మర­ణ­శి­క్ష వి­ధిం­చ­బ­డిం­ద­న్నా­రు. 216 కే­సు­ల్లో 320 మం­ది­కి యా­వ­జ్జీవ శి­క్ష పడిం­ద­ని చె­ప్పా­రు. పో­క్సో చట్టం కింద నమో­దైన మొ­త్తం 141 కే­సు­ల్లో ఈ ఏడా­ది 154 మంది నిం­ది­తు­ల­కు జీ­విత ఖైదు వి­ధిం­చ­బ­డిం­ద­ని, 3 కే­సు­ల్లో నిం­ది­తు­ల­కు మరణ శి­క్ష పడిం­దం­ని తె­లి­పా­రు. ఎస్సీ ఎస్టీ చట్టం 28 కే­సు­ల్లో 53 మంది నిం­ది­తు­ల­కు జీ­విత ఖైతు వి­ధిం­చ­బ­డిం­ద­ని తె­లి­పా­రు. ఈ ఏడా­ది రా­ష్ట్రం­లో గ్రా­మ­పం­చా­య­తీ ఎన్ని­క­ల­ను ప్ర­శాం­తం­గా ని­ర్వ­హిం­చ­డం­తో పాటు, మిస్ వర­ల్డ్ పో­టీ­లు, ఫు­ట్‍బా­ల్ ఆట­గా­డు మె­స్సీ ప్రో­గ్రా­మ్, వర­ద­లు వంటి వి­ప­త్తు­ల­ను ము­ఖ్య­మైన ఈవెం­ట్ల­ను తె­లం­గాణ పో­లీ­స్ సమ­ర్థ­వం­తం­గా ని­ర్వ­హిం­చిం­ద­ని చె­ప్పా­రు. ఈ ఏడా­ది 509 మంది మా­వో­యి­స్టు­లు లొం­గి­పో­యా­ర­ని అం­దు­లో 23 మంది తె­లం­గా­ణ మా­వో­లు ఉన్నా­ర­ని డీ­జీ­పీ వె­ల్ల­డిం­చా­రు.

Tags:    

Similar News