బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం చోటుచేసుకుంది. చేతన్ జువెలర్స్ పేరిట ప్రగతి నగర్ లో నితీష్ జైన్ అనే వ్యక్తి గత 15 ఏండ్లుగా బంగారం వ్యాపారం చేస్తూ క్వాలిటీ ఆభరణాలను చేయిస్తానని కస్టమర్లను నమ్మించారు. అతని వద్దకు వచ్చే కస్టమర్ల నుండి సుమారు రూ.10 కోట్ల విలువ చేసే బంగారం, ఆభరణాలతో ఓనర్ నితీష్ జైన్ పరారయ్యాడు. ఈ నెల 10వ తేదీ నుంచి షాపు తెరవకపోవడంతో బాధితులకు అనుమానం రావడంలో అసులు విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న బంగారు దుకాణాల వద్ద బంగారాన్ని తీసుకువచ్చి ఆభరణాలు చేయడంతో పాటు కస్టమర్లకు అమ్ముతూ దుకాణదారులకు కూడా జైన్ దగ్గరయ్యాడు. తన నెట్వర్క్ ను పెంచుకుంటూ అందరికీ నమ్మకం కలిగించి ఒక్కసారిగా భారీగా బంగారు ఆభరణాలతో పరారు కావడం గమనర్హం. భారీ మొత్తంలో నగల దుకాణాదారులు, కస్టమర్లు బంగారం ఇవ్వగా.. నితీష్ జైన్ ఆచూకీ తెలియక ఆందోళన చెందుతున్నారు. బంగారాన్ని తాకట్టు పెట్టుకుని మరీ వడ్డీలకు ఇస్తుండే వాడని తెలుస్తోంది. అంతేకాక నితీష్ జైన్. పలు గోల్డ్ స్కీంలు సైతం పెట్టి సైతం బాధి తులను ఆకర్షించారు. కేపీహెచ్ బీ, బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నితీష్ జైన్ తన వ్యాపారాన్ని నిర్వహించిన్నట్లు సమాచారం.