Crime News: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు మైనర్లకు బెయిల్
Crime News: సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు మైనర్లకు జువైనల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.;
Crime News: సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు మైనర్లకు జువైనల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో రెండుసార్లు బెయిల్ రిజెక్ట్ చేసిన జువైనల్ కోర్టు.. ఈసారి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఒక్కో మైనర్‌కు 5 వేల రూపాయల పూచీకత్తుతో పాటు...
విచారణకు సహకరించాలని కండీషన్ పెట్టింది. హైదరాబాద్ డీపీఓ ముందు ప్రతి నెల హాజరుకావాలని ఆదేశించింది. అటు.. హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున ఎమ్మెల్యే కొడుకు ఇంకా జువైనల్ హోంలోనే ఉన్నాడు. జువైనల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఎమ్మెల్యే కొడుకు హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. ఇదే కేసులో నిందితుడైన సాదుద్దీన్ మాలిక్‌కు కోర్టు బెయిల్ నిరాకరించడంతో.. జైలులో ఉన్నాడు.