మతిస్థిమితం లేని మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఈ ఘటన కర్ణాటకలోని కలబురగిలోని ప్రభుత్వ హాస్పిటల్ లో జరిగింది. కలబురగిలోని గుల్బర్గా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ లోని మహిళా వార్డులో ఓ మహిళ మానసిక అనారోగ్యంతో బాధపడుతుంది. ఆ 36 ఏళ్ల మహిళపై శుక్రవారం అర్థరాత్రి లైంగిక వేధింపులు జరిగినట్లు హాస్పిటల్ సిబ్బంది తెలిపారు.
మతిస్థిమితం సరిగ్గా లేని మహిళను ఆమె తరపు బంధువులు హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. కలబురగికి చెందిన మహెబూబ్ పాషా (40) అనే వ్యక్తి శుక్రవారం అర్థరాత్రి సదరు మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని డ్యూటీలో ఉన్న సిబ్బంది పోలీసులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహెబూబ్ పాషాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ఇంకా కేసు నమోదు చేయలేదని చెప్పారు.