హైదరాబాద్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి
పెళ్లికి నిరాకరించడంతో కత్తితో దాడి;
* హైదరాబాద్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి
* బండ్లగూడ జాగీర్ పరిధిలోని హైదర్ షా కోట్‌లో ఘాతుకం
* పెళ్లికి నిరాకరించడంతో కత్తితో దాడి
*మతాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించిన యువతి
* నిందితుడు కర్ణాటకకు చెందిన యువకుడు
హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడికి తెగబడ్డాడు. హైదర్ షాకోట్ దగ్గర ఘాతుకానికి పాల్పడ్డాడు. పెళ్లికి నిరాకరించదనే కోసంతో యువతిపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె... సొమ్మసిల్లి పడిపోయింది. మతాలు వేరు కావడంతో యువతి... పెళ్లికి నిరాకరించినట్లు తెలుస్తోంది. కర్ణాకటకు చెందిన యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.