Nalgonda: నల్గొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. పెళ్లికి అంగీకరించడం లేదని..
Nalgonda: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎడమకాలువలో ప్రేమజంట ఆత్మహత్యయత్నం కలకలం రేపుతోంది.;
Nalgonda: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎడమకాలువలో ప్రేమజంట ఆత్మహత్యయత్నం కలకలం రేపుతోంది. హాలియా సమీపంలో నాగార్జున సాగర్ ఎడమకాలువలో ప్రేమ జంట దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాలువలో వీరు దూకడాన్ని గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. ప్రియురాలిని సురక్షితంగా బయటకు తీసుకురాగా, ప్రియుడు బాలకృష్ణ మాత్రం గల్లంతయ్యాడు.
వీరిద్దరూ పీఏపల్లి మండలం నార్లతండాకి చెందిన బావా మరదలుగా గుర్తించారు. అయితే అమ్మాయి మైనర్‌గా గుర్తించారు. గల్లంతైన ప్రియుడు బాలకృష్ణ కోసం గాలింపు కొనసాగుతోంది. నార్లతండాకు చెందిన మైనర్ అమ్మాయి నందిని.. ఏపీలోని మాచర్లకు చెందిన బాలకృష్ణ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీళ్ల ప్రేమను ఇద్దరి కుటుంబ సభ్యలు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.