Maharastra Crime: భర్త దుర్మార్గం.. గర్భంతో ఉన్న భార్యకు నిప్పు..

Maharashtra Crime: గర్భంతో ఉందన్న విచక్షణను కూడా మరిచాడు.. అన్యాయంగా ఆ నిండు చూలాలికి నిప్పంటించాడు..

Update: 2021-11-03 06:30 GMT

Maharastra Crime (tv5 news.in)

Maharastra Crime: మనిషి ఎందుకు దుర్మార్గంగా మారిపోతున్నాడు.. కనీస మానవత్వం కూడా కనిపించకుండా పోతోంది.. క్షణికావేశంలో తాము తీసుకునే నిర్ణయాలు నిండు జీవితాల్ని బలి చేస్తున్నాయి. రెండో పెళ్లి చేసుకున్న నిందితుడు, మొదటి భార్య అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.. ఆమెను హతమార్చేందుకు పన్నాగం పన్నాడు.. గర్భంతో ఉందన్న విచక్షణను కూడా మరిచాడు.. అన్యాయంగా ఆ నిండు చూలాలికి నిప్పంటించాడు.. మంటలకు తాళలేక కడుపులో బిడ్డ కన్నుమూసింది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది.. మహారాష్ట్ర ఠాణేలోని కల్వా మఫత్ లాల్ కాలనీకి చెందిన అనిల్ బహదూర్ చౌరాసియా అనే 35 ఏళ్ల వ్యక్తికి ఓ మహిళతో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భవతి. ఈ క్రమంలో మరో వివాహం చేసుకున్న నిందితుడు.. భార్యతో తరచు గొడవ పడుతుండేవాడు.

అక్టోబర్ 30న గర్భిణీ అనే కనికరం లేకుండా భార్యకు నిప్పంటించాడు. మంటలకు తాళలేక ఆమె కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు గమనించి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యమైంది.. కడుపులో బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఆమె పరిస్థితీ విషమంగా ఉందని వైద్యులు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Tags:    

Similar News