mancherial : మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమోనని వివాహిత ఆత్మహత్య..!

mancherial : మంచిర్యాలలో విషాదకర ఘటన చోటు చేసకుంది. ఆడపిల్ల పుడుతుందేమోనని బలవన్మరణానికి పాల్పడింది ఓ వివాహిత.;

Update: 2022-01-07 02:45 GMT

Mancherial : మంచిర్యాలలో విషాదకర ఘటన చోటు చేసకుంది. ఆడపిల్ల పుడుతుందేమోనని బలవన్మరణానికి పాల్పడింది ఓ వివాహిత. పట్టణంలోని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన ఆనంద్‌- రమ్య దంపతులకు 2017లో వివాహం అయ్యింది. వీరికి మొదటి సంతానంలో ఆరాధ్య జన్మించింది. ప్రస్తుతం రమ్య తొమ్మిది నెలల గర్భిణి కావడంతో వైద్యులు డెలివరీ డేట్‌ ఫిక్స్‌ చేశారు. మొదటి సంతానంలో ఆడపిల్ల పుట్టిందని.. మరోసారి ఆడపిల్ల పుడుతుందేమో అన్న భయంతో రమ్య.. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు.. ఎంత పనిచేస్తివి బిడ్డా అంటూ గుండెలు బాదుకుంటున్న తీరు స్థానికులను కలిచివేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌ తెలిపారు.

Tags:    

Similar News