Wayanad: లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి హత్య.. హంతకులను సపోర్ట్ చేసిన మృతుడి భార్య.. ఇదే అసలైన ట్విస్ట్..
Wayanad: ఇద్దరు మైనర్ కూతుళ్లు కలిసి తన తల్లి జీవితాన్ని కాపాడారు.;
Wayanad: ఇద్దరు మైనర్ కూతుళ్లు కలిసి తన తల్లి జీవితాన్ని కాపాడారు. తన తల్లిని రేప్ చేయాలనుకున్న వ్యక్తిని చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. అందరినీ ఎంతగానో కదిలించిన ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని వాయనాడ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో హత్యకు పాల్పడినందుకు మైనర్ అమ్మాయిలను, వారి తల్లిని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. కానీ మృతుడి భార్య మాత్రం ఈ కేసులో అందరు ఆశ్చర్యపోయే అనుమానాలను వెల్లడిస్తోంది.
వాయనాడ్‌లో నివాసముంటున్న 68 ఏళ్ల మహమ్మద్.. తన భార్య మరదలిని తరచుగా వేదింపులకు గురిచేస్తూ ఉండేవాడు. మంగళవారం మహమ్మద్ ఏకంగా తనపై లైంగికంగా దాడి చేయబోయాడు. ఇది గమనించిన మహిళ కూతుళ్లు గొడ్డలితో తనపై దాడి చేశారు. అనంతరం మహమ్మద్ మృతదేహాన్ని ఓ సంచిలో పెట్టి బావిలో పడేశారు. ఆ తర్వాతే వారే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. కానీ మహమ్మద్ భార్య మాత్రం వారు హత్య చేశానంటే తాను నమ్మనని చెప్తోంది.
మృతుడు మహమ్మద్ భార్య ఈ సంఘటనపై స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఇద్దరు అమ్మాయిలు ఈ హత్య చేశామంటే తాను నమ్మనని చెప్తోంది. తన తమ్ముడు, అతడి కొడుకే మహమ్మద్‌ను హత్య చేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేస్తోంది. వారే బెదిరించి ఆ అమ్మాయిలను కేసులో ఇరికించి ఉంటారని మహమ్మద్ భార్య స్టేట్‌మెంట్ ఇచ్చింది.
తన మరదలిపై జరిగిన లైంగిక దాడి గురించి ఆమె ఏమీ మాట్లాడకపోయినా.. తన భర్త మహమ్మద్‌ను హత్య చేశామంటూ ముందుకొచ్చిన అమ్మాయిలకు సపోర్ట్ చేస్తూ.. వారు ఈ హత్య చేసి ఉండరని బల్ల గుద్ది చెప్తోంది. తన సొంత తమ్ముడే ఈ హత్యలో ప్రధాన నిందితుడని భావిస్తోంది. అందుకే ఈ కేసులో విచరాణ చేపట్టిన పోలీసులు ఎవరి స్టేట్‌మెంట్ నిజమో తెలుసుకోవడానికి దర్యాప్తును వేగవంతం చేశారు.