nalgonda: నల్గొండ జిల్లాలో నవ వధువు బలవన్మరణం
nalgonda: అత్తింటి వారే చంపి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు.;
nalgonda: నల్గొండ జిల్లాలో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన చండూరు మండలం పుల్లెంల గ్రామంలో చోటుచేసుకుంది. నకరికంటి అశ్విని అనే నవ వధువు ఉరివేసుకొని చనిపోయింది. అయితే.. అత్తింటి వారే చంపి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రులు రాకుండానే మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారంటూ బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో చండూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.