Hyderabad: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కిడ్నాప్, అత్యాచారం..
Hyderabad: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కిడ్నాప్, అత్యాచారం జరిగింది.;
Hyderabad: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కిడ్నాప్, అత్యాచారం జరిగింది. ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న అనూష కూతురిపై లైంగిక దాడి జరిగినట్లు తెలుస్తోంది. 9 నెలల క్రితం మైనర్ బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు యువకుడు. బాలికపై లైంగిక దాడి చేసి గర్భవతి చేశారంటోంది బాధితురాలి తల్లి అనూష. మహబూబాబాద్‌కి చెందిన మైనర్ బాలుడు అత్యాచారం చేశాడని, బాలికను పెళ్లి చేసుకోకుండా గర్భవతి చేశాడని ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటోంది. పైగా తనపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని.. తన కూతురికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు అనూష.