ఆన్‌లైన్ మోసం.. రూ. 1.5 కోట్లు పోగొట్టుకున్న థానే మహిళ

ఆన్‌లైన్ మోసాల గురించి అనుక్షణం అప్రమత్తం చేస్తున్నా ఇంకా అక్కడక్కడా మోసపోతున్న వారి సంఖ్య వెలుగు చూస్తూనే ఉంది.;

Update: 2024-06-29 07:22 GMT

థానేకు చెందిన 62 ఏళ్ల మహిళ ఆన్‌లైన్ పెట్టుబడులపై ఆసక్తి చూపింది. "అధిక రాబడి"  వస్తుందనే సరికి మరో అడుగు ముందుకు వేసి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టింది. కానీ ఆమె ఆశ అత్యాశే అయింది. లాభం సంగతి దేవుడెరుగు. తాను పెట్టుబడి పెట్టిన సంస్థ మోసపూరమైందని తెలుసుకుని లబో దిబో మంటోంది.  దాదాపు ₹ 1.5 కోట్లను నష్టపోయింది. ఈ మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

ఏప్రిల్-జూన్ మధ్య తాను నిందితుడితో టచ్‌లో ఉన్నానని కవేసర్ ప్రాంతంలోని నివాసి పోలీసులకు తెలిపారు. నిందితుడు మహిళకు లింక్‌లను అందించి, ఆమెకు "అధిక రాబడి" వస్తుందని చెప్పి మొత్తం ₹ 1,45,35,6000 పెట్టుబడి పెట్టడానికి ముందు ఆమెను వాట్సాప్ గ్రూప్‌లో చేర్చినట్లు అధికారి తెలిపారు.

అయితే, నిందితుడిని అనుసరించిన తర్వాత కూడా మహిళ తన డబ్బుపై ఎలాంటి రిటర్న్‌లను పొందలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించిందని కాసర్వాడవ్లీ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. నిందితులను ఉష్మా షా, సునీతా కుమారి, అభిజిత్ గాంధీ, వివేక్ పటేల్, కేతన్ మార్వాడీ, జూని వి పటేల్, నరేష్ కుమార్ డి జడేజాగా గుర్తించామని, వారిపై ఐపిసి, ఐటి చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Tags:    

Similar News