Hyderabad: మార్కెట్లోకి నకిలీ సిగరెట్లు.. విలువ కోట్లు..
Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ సిగరెట్ల కలకలం రేగింది.;
Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ సిగరెట్ల కలకలం రేగింది. అబిడ్స్ పరిధిలోని ట్రూప్ బజార్‌లో గోదాములో దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గోదాముల్లో భారీగా నకిలీ సిగరెట్లు నిల్వ చేసినట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. తనిఖీలు చేసి 2కోట్ల విలువైన నకిలీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. సిగరెట్లు నిల్వ చేసిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పేర్కొన్నారు.