Uttar Pradesh: ఫరూఖాబాద్ జైలులో ఉద్రిక్తత.. సిబ్బందిపై ఖైదీల దాడి..
Uttar Pradesh: యూపీలోని ఫరూఖాబాద్ లోని జైలులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.;
Uttar Pradesh (tv5news.in)
Uttar Pradesh: యూపీలోని ఫరూఖాబాద్ లోని జైలులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జైలులోని సిబ్బందిపై ఖైదీలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో 30 మంది పోలీసులు, ఆరుగులు ఖైదీలు గాయపడ్డారు. సఫాయి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ ఓ ఖైది డెంగీతో చనిపోయాడు. ఇది తెలుసుకున్న తోటి ఖైదీలు నిరసనకు దిగారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు.
ఇంత జరుగుతున్న జైలు సిబ్బంది పై అధికారులకు సమాచారమివ్వలేదు. ఇదే సమయంలో జైలు ఆస్తులకు ఖైదీలు నిప్పంటించారు. దీంతో పై అధికారులకు సమాచారమిచ్చారు సిబ్బంది.
వెంటనే సమాచారమందుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిలో డిప్యూటీ జైలర్ ఉన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప హాస్పిటల్ కు తరలించారు. జైలులో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు అధికారులు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.