నడిరోడ్డుపై డాక్టర్ దంపతుల దారుణ హత్య
డాక్టర్ దంపతులను నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా కాల్చి పారిపోయాడు.;
అక్రమ సంబంధం ఆయన పాలిట శాపమైంది. ఆమె సోదరుడి మనసులో రెండేళ్లుగా రగులుతున్న మంటకి నిన్న ముగింపు పలికాడు. డాక్టర్ దంపతులను నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా కాల్చి పారిపోయాడు. ఈ సంఘటన రాజస్థాన్ లోని భరత్ పూర్ లో జరిగింది.
భరత్ పూర్ కు చెందిన డాక్టర్ దంపతులు.. డాక్టర్ సందీప్, డాక్టర్ సీమలు శుక్రవారం సాయింత్రం కారులో వెళుతున్నారు. బిజీగా ఉన్న ఆ రోడ్డులో క్రాసింగ్ వద్ద బైక్ నడుపుతున్న ఇద్దరు వ్యక్తులు వేగంగా వచ్చి కారు ముందు బండిని ఆపారు.
అనంతరం బండి మీద వెనుక కూర్చున్న ఒక వ్యక్తి దిగి కారు వద్దకు వచ్చాడు. డాక్టర్ ని కారు అద్దాలు కిందకు దించమని అడిగాడు. డాక్టర్ సందీప్ గ్లాస్ కిందకు దించిన వెంటనే తుపాకితో భార్యా భర్తలు ఇద్దరిని కాల్చి వెంటనే అక్కడి నుంచి బండి ఎక్కి వెళ్లి పోయారు. ఈ సంఘటన సిసిటివి ఫుటేజీలో రికార్డయింది. నిన్న శుక్రవారం సాయంత్రం 4.45 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది.
ప్రతీకారం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని పోలీసులు వివరించారు. డాక్టర్ సందీప్ కు ఓ యువతితో సంబంధం ఉంది. భర్తతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న యువతిని హత్య చేసిన కేసులో దంపతులిద్దరూ అరెస్టై బెయిల్ పై విడుదలయ్యారు.
దంపతులపై కాల్పులు జరిపిన వ్యక్తిని హత్య చేసిన మహిళ సోదరుడిగా గుర్తించారు.