RIYAZ: 25 ఏళ్ల వయసు.. 40కి పైగా క్రిమినల్ కేసులు
గగుర్పాటుకు గురిచేస్తున్న రియాజ్ క్రైం రికార్డు.. 25ఏళ్ల వయసులోనే 40 నేరాల్లో భాగం..ఓ రౌడీ గ్యాంగ్‌లో మెంబర్‌గా చేరిన రియాజ్
నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కానిస్టేబుల్ హత్య కేసులో ఆదివారం అరెస్టు అయిన రియజ్ , ఎన్కౌంటర్లో మృతి చెందాడు. రియాజ్ ఓ యువకుడితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గాయాలతో ఉన్న రియాజ్‌ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పరుగెత్తే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ హతమయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టైంలో ఈ ఉదయం పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. ఎక్సరే కోసం తరలిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని ఎస్కేప్ అవ్వాలని చూశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆయనపై కాల్పులు జరిపాడు. ఇప్పటికే వైలెంట్ ఉన్న రియాజ్ ఓ కానిస్టేబుల్‌ను పొట్టన పెట్టుకున్నాడు. మరోసారి అలాంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో రియాజ్ ఆసుపత్రిలోనే హతమయ్యాడు.
మూడేళ్లలో 40కి పైగా క్రిమినల్ కేసులు
తెలంగాణలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు, రౌడీషీటర్ షేక్ రియాజ్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో పోలీసుల వద్ద గన్ లాక్కొని పారిపోయే క్రమంలో అతడిని ఎన్కౌంటర్ చేశారు. కాగా, రియాజ్ పాతికేళ్ల వయసులోనే 40 నేరాల్లో భాగమయ్యాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన రియాజ్.. ఆ తర్వాత నేరాల బాట పట్టాడు. ముందుగా ఓ రౌడీ గ్యాంగ్‌లో మెంబర్‌గా చేరిన రియాజ్.. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి సొంతంగా నేరాలు చేయటం ప్రారంభించాడు. ముఖ్యంగా బుల్లెట్ బైకులు అతడు చోరీలు చేసేవాడు. అతడి కన్ను పడితే బుల్లెట్ బైక్ మాయం కావాల్సిందేనని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 30 బైకులు చోరీ చేసి వాటిని మహారాష్ట్రలో విక్రయించి వచ్చే డబ్బులతో జల్సాలు చేసేవాడు. గత మూడేళ్ల వ్యవధిలోనే అతడిపై 40కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మెుత్తం మూడు సార్లు జైలుకు వెళ్లి బయటకు వచ్చాడు. అయినా అతడి తీరులో మార్పు రాలేదు. మళ్లీ నేరాల బాట పట్టాడు. ఈ క్రమంలోనే.. అక్టోబర్ 17 రాత్రి ద్విచక్ర వాహనం దొంగతనం కేసులో నిందితుడైన రియాజ్‌ను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కానిస్టేబుల్ ప్రమోద్ తన మేనల్లుడి సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌కు బైక్‌పై తరలిస్తుండగా.. వినాయక్‌నగర్ వద్ద రియాజ్ కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ను వెనుక నుంచి ఛాతీలో పొడిచి పరారయ్యాడు. ఈ దాడిలో ప్రమోద్ మరణించారు.