EAGLE : తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న డ్రగ్స్ పార్టీ

మొయినాబాద్ ఫాం హౌస్‌లో డ్రగ్స్ కలకలం... మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్

Update: 2026-03-15 07:45 GMT

రం­గా­రె­డ్డి జి­ల్లా మొ­యి­నా­బా­ద్‌­లో­ని పై­ల­ట్ రో­హి­త్‌­రె­డ్డి ఫా­మ్‌­హౌ­స్‌ మరో­సా­రి వా­ర్త­ల్లో­కె­క్కిం­ది. పొ­లి­టి­క­ల్ ప్ర­ము­ఖుల వీ­కెం­డ్ డ్ర­గ్‌ పా­ర్టీ హా­ట్‌­టా­పి­క్‌­గా మా­రిం­ది. ఈ పా­ర్టీ­లో ఓ ఎం­పీ­తో­పా­టు.. పొ­లి­టి­క­ల్ లీ­డ­ర్లు, వీ­ఐ­పీ­లు పా­ల్గొ­న­డం సం­చ­ల­నం­గా మా­రిం­ది. అం­తే­కా­కుం­డా.. ఓ మహిళ కూడా ఉం­డ­టం.. తని­ఖీ­ల­కు వె­ళ్లిన పో­లీ­సు­ల­ను బె­ది­రి­స్తూ గా­ల్లో­కి కా­ల్పు­లు జర­ప­డం కల­క­లం రే­పిం­ది. అం­తే­కా­కుం­డా.. ఓ మహిళ కూడా ఉం­డ­టం.. తని­ఖీ­ల­కు వె­ళ్లిన పో­లీ­సు­ల­ను బె­ది­రి­స్తూ గా­ల్లో­కి కా­ల్పు­లు జర­ప­డం కల­క­లం రే­పిం­ది. పై­ల­ట్‌ రో­హి­త్‌­రె­డ్డి ఫా­మ్‌­హౌ­స్‌­లో డ్ర­గ్స్ పా­ర్టీ­ని భగ్నం చే­సిన ఈగల్ టీమ్.. ఫా­మ్‌­హౌ­స్‌­లో రెం­డు గ్రా­ముల కొ­కై­న్ సీ­జ్‌ చే­సి­న­ట్లు చే­వె­ళ్ల డీ­సీ­పీ యో­గే­ష్‌ గౌ­త­మ్‌ తె­లి­పా­రు. ఫా­మ్‌­హౌ­స్‌­లో పై­ల­ట్‌ రో­హి­త్‌ పా­ర్టీ ని­ర్వ­హిం­చా­ర­ని.. వీ­రం­తా హా­జ­ర­య్యా­ర­ని తె­లి­పా­రు. ఈగ­ల్‌ టీ­మ్‌­ను చూసి నమి­త్ శర్మ గా­ల్లో ఫైర్ చే­శా­ర­ని.. గన్ లై­సె­న్స్‌ రి­తే­ష్‌­రె­డ్డి పేరు మీద ఉం­ద­ని తె­లి­పా­రు. దా­డు­ల్లో రెం­డు గ్రా­ముల వై­ట్‌ పౌ­డ­ర్‌­ను సీ­జ్‌ చే­శా­మ­ని.. అదు­పు­లో­కి తీ­సు­కు­న్న 11 మం­ది­లో ఒక మహిళ, వ్యా­పా­రి, రి­య­ల్ట­ర్స్ ఉన్నా­ర­న్నా­రు. డ్ర­గ్స్‌ పా­జి­టి­వ్ వచ్చిన ఐదు­గు­రు.. గతం­లో వేరే చోట డ్ర­గ్స్‌ తీ­సు­కు­న్నా­మ­ని చె­బు­తు­న్నా­ర­న్నా­రు. ఫా­మ్‌­హౌ­స్‌­ల­పై కా­ర్డ­న్ సె­ర్చ్ ఆప­రే­ష­న్స్ చే­స్తు­న్నా­మ­ని.. తమకు ఇం­టె­లి­జె­న్స్‌ టీ­మ్‌ కూడా ఉం­ద­ని చే­వె­ళ్ల డీ­సీ­పీ తె­లి­పా­రు.

అసలేం జరిగిందంటే

రం­గా­రె­డ్డి జి­ల్లా మొ­యి­నా­బా­ద్ మం­డ­లం­లో­ని అజీ­జ్‌­న­గ­ర్ ప్రాం­తం­లో ఉన్న మాజీ ఎమ్మె­ల్యే పై­లె­ట్ రో­హి­త్ రె­డ్డి ఫాం­హౌ­స్ మరో­సా­రి వి­వా­దా­స్పద ఘట­న­తో రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా చర్చ­నీ­యాం­శం­గా మా­రిం­ది. శని­వా­రం రా­త్రి అక్కడ జరు­గు­తు­న్న డ్ర­గ్స్ పా­ర్టీ­పై పో­లీ­సు­లు ఆక­స్మి­కం­గా దాడి చేసి పా­ర్టీ­ని భగ్నం చే­య­డం­తో పాటు కొ­కై­న్, తు­పా­కీ వంటి వస్తు­వు­ల­ను స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­రు. ఈ ఘట­న­లో రా­జ­కీయ ప్ర­ము­ఖు­లు, వ్యా­పా­ర­వే­త్త­లు పా­ల్గొ­న్న­ట్లు పో­లీ­సు­లు గు­ర్తిం­చ­గా, ప్రా­థ­మిక డ్ర­గ్ పరీ­క్ష­ల్లో ఐదు­గు­రి­కి పా­జి­టి­వ్ వచ్చి­న­ట్లు అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. ఈ సం­ఘ­టన రా­ష్ట్ర రా­జ­కీయ వర్గా­ల్లో­నూ కల­క­లం రే­పు­తోం­ది.ఈ పా­ర్టీ­లో మొ­త్తం పది మంది పా­ల్గొ­న్న­ట్లు పో­లీ­సు­లు గు­ర్తిం­చా­రు. వా­రి­లో తొ­మ్మి­ది మంది పు­రు­షు­లు కాగా, ఒక మహిళ కూడా ఉన్న­ట్లు అధి­కా­రు­లు తె­లి­పా­రు. ఈ పా­ర్టీ­లో రా­జ­కీయ రం­గా­ని­కి చెం­దిన వ్య­క్తు­లు, వ్యా­పా­ర­వే­త్త­లు ఉన్న­ట్లు పో­లీ­సు­లు గు­ర్తిం­చా­రు.

డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితీష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్ మిశ్రా, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి అనే వ్యక్తులకు డ్రగ్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఇదే పార్టీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీ కూడా పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏలూరు పార్లమెంట్ సభ్యుడు పుట్ట మహేష్ కుమార్ ఈ వీకెండ్ పార్టీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే డ్రగ్ వినియోగంపై పూర్తి నిర్ధారణ కోసం నిందితుల నుంచి సేకరించిన నమూనాలను ప్రయోగశాలకు పంపినట్లు అధికారులు పేర్కొన్నారు.

రెండు లగ్జరీ కార్లు సీజ్

పో­లీ­సుల సో­దా­ల్లో ఫాం­హౌ­స్ ప్రాం­గ­ణం­లో ఉన్న రెం­డు లగ్జ­రీ కా­ర్ల­ను కూడా స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­రు. TS09FE3929, TS09FE3939 నం­బ­ర్ల­తో ఉన్న ఆ వా­హ­నా­ల­ను పో­లీ­సు­లు తమ కస్ట­డీ­లో­కి తీ­సు­కు­న్నా­రు. అదే­వి­ధం­గా ఖరీ­దైన వి­దే­శీ మద్యం బా­టి­ళ్లు, హు­క్కా పై­ప్స్ వంటి పరి­క­రా­ల­ను కూడా సీజ్ చే­సి­న­ట్లు సమా­చా­రం. ఈ ఘట­న­కు సం­బం­ధిం­చి అను­మ­తి లే­కుం­డా పా­ర్టీ ని­ర్వ­హిం­చ­డం, డ్ర­గ్స్ వి­ని­యో­గిం­చ­డం, ఆయు­ధాల దు­ర్వి­ని­యో­గం వంటి అం­శా­ల­పై సం­బం­ధిత సె­క్ష­న్ల కింద కే­సు­లు నమో­దు చేసి పో­లీ­సు­లు దర్యా­ప్తు కొ­న­సా­గి­స్తు­న్నా­రు. ఈ సం­ఘ­టన బయ­ట­కు రా­వ­డం­తో రా­జ­కీయ వర్గా­ల్లో తీ­వ్ర చర్చ­కు దారి తీ­సిం­ది. ఒక మాజీ ఎమ్మె­ల్యే ని­వా­సం­లో డ్ర­గ్స్ పా­ర్టీ జరు­గు­తుం­డ­గా పో­లీ­సు­లు దాడి చే­య­డం, డ్ర­గ్ టె­స్టు­ల్లో పా­జి­టి­వ్ రా­వ­డం వంటి అం­శా­లు సం­చ­ల­నం­గా మా­రా­యి. ఇదే ఫాం­హౌ­స్ గతం­లో కూడా ఒక పె­ద్ద రా­జ­కీయ వి­వా­దా­ని­కి కేం­ద్రం­గా ని­లి­చిం­ది. అప్ప­ట్లో ఎమ్మె­ల్యేల కొ­ను­గో­లు వ్య­వ­హా­రం వె­లు­గు­లో­కి వచ్చి­న­ప్పు­డు ఇదే ఫాం­హౌ­స్ వా­ర్త­ల్లో ని­లి­చిం­ది. ఇప్పు­డు మరో­సా­రి డ్ర­గ్స్ పా­ర్టీ, తు­పా­కీ కా­ల్పుల ఘట­న­తో అదే స్థ­లం మళ్లీ రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా చర్చ­నీ­యాం­శం­గా మా­రిం­ది. ప్ర­స్తు­తం పో­లీ­సు­లు ఈ కే­సు­ను సీ­రి­య­స్‌­గా తీ­సు­కు­ని అన్ని కో­ణా­ల్లో వి­చా­రణ కొ­న­సా­గి­స్తు­న్నా­రు. పార్టీలో లభించిన డ్రగ్స్‌, వెపన్‌పై పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చిన కౌశిక్ రవి.. పార్టీలో డ్రగ్స్‌ తీసుకున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై BNS 109తోపాటు ఆర్మ్స్‌ యాక్ట్‌..కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News