Hyderabad: స్కూల్ విద్యార్థులపై కరస్పాండెంట్ కుమారుడి కన్ను.. లైంగికంగా వేధిస్తూ..
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలోని మొయిన్‌బాగ్ యూనిక్ హైస్కూల్‌లో దారుణం జరిగింది.;
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలోని మొయిన్‌బాగ్ యూనిక్ హైస్కూల్‌లో దారుణం జరిగింది. మైనర్ విద్యార్ధుల్ని లైంగికంగా వేధిస్తున్నాడు కరస్పాండెంట్ కొడుకు యాసిర్. 20 ఏళ్ల యాసిర్.. మైనర్ విద్యార్ధులకు చాక్లెట్, బిస్కెట్లు ఆశ చూపి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తఫోన్‌లో రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్ధులన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో.... సంతోష్‌నగర్ పోలీసలకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. దీనిపై కేసు నమోదు చేశారు సంతోష్‌నగర్ పోలీసులు.