Kolkata: తోటి సిబ్బందిపై కాల్పులు జరిపిన కానిస్టేబుల్.. ఒకరు మృతి..
Kolkata: పశ్చిమ బెంగాల్ కోల్‌కతా మ్యూజియంలో దారుణం జరిగింది.;
Kolkata: పశ్చిమ బెంగాల్ కోల్‌కతా మ్యూజియంలో దారుణం జరిగింది. విధుల్లో ఉన్న CISF కానిస్టేబుల్ తన దగ్గర ఉన్న AK 47తో తోటి సిబ్బందిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ పారామిలిటరీ జవాన్ ప్రాణాలు కోల్పోగా.. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో జరిగింది. కాల్పులు జరిపిన కానిస్టేబుల్‌ను కోల్‌కతా పోలీసులు పట్టుకున్నారు. ఐతే కాల్పులు జరపడానికి కారణం ఏంటన్నది తెలియరాలేదన్నారు సీపీ వి.కె.గోయల్.