ఢిల్లీలోని ఓ హోటల్లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం జరిగింది. నార్త్ ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ లో నితేష్ (24) అనే యువకుడు హోటల్ గదిని మంగళవారం సాయంత్రం బుక్ చేసుకున్నాడు. బుధవారం ఉదయం హోటల్ సిబ్బంది రూం తెరిచి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ముఖానికి ప్లాస్టిక్ బ్యాగ్ కప్పుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్లాస్టిక్ సంచిలోంచి చిన్న ఆక్సీజన్ సిలిండర్ కు కనెక్ట్ చేయబడిన ట్యూబ్ ఉన్నట్లు చెప్పారు. ఆక్సీజన్ ఓవర్ డోస్ తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పారు. ఆక్సీజన్ అధికంగా తీసుకున్నప్పుడు హృదయ స్పందన రేటు ప్రమాదకరంగా తక్కువగా నమోదై, విషంగా మారుతుందని తెలిపారు.
పోలీసులు స్వాదీనం చేసుకున్న సుసైడ్ నోట్ ప్రకారం... నితేష్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నాడు. తనను రక్షించుకోవడానికి తల్లిదండ్రులు ఎక్కువ డబ్బును ఖర్చుపెడుతున్నారని ఆవేదనను వ్యక్తం చేశాడు. అందుకే తన జీవితాన్ని ముగించాలని అనుకుంటున్నట్లు నిర్ణయించుకున్నాడని పోలీసులు తెలిపారు.