Hyderabad : థమ్స్‌అప్ లోడ్ లారీ బోల్తా.. సీసాల కోసం ఎగబడ్డ జనం..!
Hyderabad : థమ్స్‌అప్ లోడ్‌తో వెళుతున్న ఓ లారీ టైర్ పేలడంతో అదుపుతప్పింది. దీనితో లారీలోని థమ్స్ అప్ కూల్ డ్రింక్స్ అన్ని రోడ్డుకి ఇరువైపులా పడిపోయాయి..;
Hyderabad : థమ్స్‌అప్ లోడ్‌తో వెళుతున్న ఓ లారీ టైర్ పేలడంతో అదుపుతప్పింది. దీనితో లారీలోని థమ్స్ అప్ కూల్ డ్రింక్స్ అన్ని రోడ్డుకి ఇరువైపులా పడిపోయాయి.. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేట్ సమీపంలో ఓఆర్‌ఆర్‌పై ఘట్‌కేసర్ మార్గంలో మంగళవారం రాత్రి 7.30 గంటలకు చోటుచేసుకుంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. అయితే వారిని పట్టించుకోకుండా కొందరు వాహనదారులు కిందపడిపోయిన థమ్స్ అప్ కూల్ డ్రింక్స్ లను దొరికినంత వరకు దోచుకొని వెళ్లారు. కొద్దిసేపట్లోనే లారీలోని మొత్తం సరకు ఖాళీ అయిపోవడం గమనార్హం.. దీనిపైన సమాచారం అందుకున్న పోలిసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి చర్యలు చేపట్టారు.