తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించిన ‘మెగా ఎయిర్ షో’ను వీక్షించేందుకు లక్షలాది సందర్శకులు పోటెత్తారు. చెన్నై నుంచే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలిరావడంతో.. మెరీనా బీచ్ సమీపంలోని లైట్‌హౌస్ మెట్రో స్టేషన్, వెళచ్చేరి వద్ద ఉన్న ఎంఆర్‌టీఎస్ రైల్వేస్టేషన్‌లు కిక్కిరిసిపోయాయి. షో ముగిసిన అనంతరం తిరుగుప్రయాణం కోసం లక్షల మంది ఒక్కసారిగా స్టేషన్‌లకు చేరుకోవడంతో ప్లాట్‌ఫాంలపై నిలబడేందుకూ వీల్లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైల్వేస్టేషన్‌లో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ముగ్గురు సొమ్మసిల్లి ప్రాణాలు విడిచారు. మరొకరు గుండెపోటుతో మృతి చెందారు. అస్వస్థతకు గురైన దాదాపు 200 మందిని చెన్నైలోని 3 ఆసుపత్రులకు తరలించారు. మృతులు శ్రీనివాసన్, కార్తికేయన్, జాన్‌బాబు, దినేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఎయిర్ షోకు దాదాపు13 లక్షలమందికి పైగా సందర్శకులు హాజరైనట్లు సమాచారం.