బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అంత ర్జాతీయ నేరగాళ్లను బుధవారం సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. అమర్ నాథ్ సింగ్, రణ్ వీర్ సింగ్ అంతర్జాతీయ కంపెనీల్లో పెట్టుబడుల పేరుతో ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. మొబైల్ ఫోన్ల ద్వారా ఆర్డర్లు అందిస్తామని ప్రలోభపెట్టి సామాన్యులను బురిడి కొట్టించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి నకిలీ మెయిల్ పంపి సుమారు రూ.10 లక్షల రూపాయలు కాజేశారు. కాగా బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు అంతర్జాతీయ సైబర్ నిందితులు అమర్ నాథ్ సింగ్, రణ్వీర్ సింగ్ లను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన క్రైం పోలీసులను ఉన్నతాధికారులు ప్రశంసించారు.