Secunderabad: ఎస్సైపై హత్యాయత్నం.. కత్తులతో దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు..
Secunderabad: సికింద్రాబాద్ మారేడుపల్లి ఎస్సైపై హత్యాయత్నం జరగడం సంచలనంగా మారింది.;
Secunderabad: సికింద్రాబాద్ మారేడుపల్లి ఎస్సైపై హత్యాయత్నం జరగడం సంచలనంగా మారింది. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఎస్సై వినయ్‌కుమార్‌ను అర్థరాత్రి రెండున్నర గంటలకు ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడిచి పరారయ్యారు. ప్రైవేట్ నర్సింగ్‌హోంలో చికిత్స తీసుకున్న ఎస్సై వినయ్‌కుమార్ డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. నిందితులను లంగర్‌హౌస్‌కు చెందిన పవన్‌సింగ్, జవహర్‌నగర్‌కు చెందిన సంజయ్‌సింగ్‌గా గుర్తించారు. పవన్‌సింగ్ వాచ్‌మ్యాన్ కాగా, సంజయ్‌సింగ్ క్యాటరింగ్ బాయ్.. వీరిద్దరూ ఇప్పటికే చాలా చోరీల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.