Vizianagaram: బైక్ దొంగిలించి వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి..
Vizianagaram: విజయనగరం జిల్లా సీతానరగం మండలంలోని.. పనుకుపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.;
Vizianagaram: విజయనగరం జిల్లా సీతానరగం మండలంలోని.. పనుకుపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీ కొన్న ప్రమాదంలో.. ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు విశాఖలో బైక్ దొంగలించి ఒడిశాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బైక్ చోరీకి గురైనట్లు విశాఖలోని పీఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.