Uttar Pardesh: అమావాస్య రోజుల్లో పోలీసులు ఆప్రమత్తంగా ఉండాలి

ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేసిన డీజీపీ

Update: 2023-08-22 08:00 GMT

నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు హిందూ క్యాలెండర్ ఫాలో అవ్వాలని, అందులో చెప్పిన ప్రకారం అమావాస్య రోజున అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు యూపీ డీజీపీ విజయ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

చిన్నప్పుడు కథలు చెప్పుకునేటప్పుడు దొంగతనం అనగానే ముందు వచ్చే మాట అమావాస్య అర్ధరాత్రి.. నిజంగానే చీకటి రాత్రులు చాలా భయంకరమైనవి. అయితే ఆ విషయాన్ని ఓ డీజీపీ సర్క్యులర్ లో పేర్కొనడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది వివరాలలోకి వెళితే

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) విజయ్ కుమార్ జారీచేసిన ఈ ఇంటర్నల్ సర్క్యులర్ బయటకు వచ్చి వైరల్ అవుతోంది. అమావాస్య రోజున నేరగాళ్లు చురుగ్గా ఉంటారని, చాలా వరకు ముఠాలు ఆ రోజున దాడులకు సిద్ధమవుతాయని ఆ సర్క్యులర్‌లో డీజీపీ పేర్కొన్నారు.

ఆగస్టు 14న జారీ చేసిన ఈ సర్క్యులర్‌కు పంచాంగం కాపీని కూడా జత చేశారు. అమావాస్య రోజుల్లో నైట్ పెట్రోలింగ్ పెంచాలని సూచించారు. మరీ ముఖ్యంగా అమావాస్య రోజున మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆగస్టు 16, సెప్టెంబరు 14, అక్టోబరు 14న అమావాస్య వస్తుందని, అమావాస్యకు వారం రోజులు ముందు, ఆ తర్వాత వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు కూడా అమావాస్య రోజుల్లో అప్రమ్తతంగా ఉండాలని కోరారు. అయితే ఈ విషయాన్ని ఇతర పోలీసు అధికారుల సైతం చాలా సహజంగానే తీసుకున్నారు ఎందుకంటే నిజంగానే అమావాస్య రాత్రులలో రెచ్చిపోతారని, ఇదేమి  కొత్త విషయం కాదని అన్నారు. ఒకవేళ నేరాల నివారణ కోసం మ్యాపింగ్ చేస్తే అప్పుడు ఈ విషయం తప్పకుండా బయటపడుతుంది అన్నారు. అందుకే పోలీసులు ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Tags:    

Similar News