Uthra Murder Case : భర్త కాదు యముడే... భార్యను చంపేందుకు రెండు సార్లు పాముతో... !
Uthra Murder Case : మనుషుల్లో మానవత్వం రోజురోజుకూ మంటకలిసి పోతుంది.. సాటి మనుషులు అని కూడా చూడకుండా హత్యలకి పాల్పడుతున్నారు.;
Uthra Murder Case : మనుషుల్లో మానవత్వం రోజురోజుకూ మంటకలిసి పోతుంది.. సాటి మనుషులు అని కూడా చూడకుండా హత్యలకి పాల్పడుతున్నారు. ఇంకా ఇందులో సొంత కుటుంబానికి సంబంధించిన వ్యక్తులనే చంపేందుకు ప్లాన్లు వేస్తున్నారు. ఇది కూడా అలాంటిదే.. ఓ వ్యక్తి తన భార్యను చంపడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు.. మొదటిసారి ఫెయిల్ అయిన రెండో సారి అదే ప్లాన్ అతని మెడకి చుట్టుకుంది.
కేరళలోని కొల్లాం జిల్లాలోని అంచల్పట్టణానికి చెందిన ఉత్రా, సూరజ్ భార్యభర్తలు... ఉత్రా మే7, 2020లో పాముకాటుతో చనిపోయింది. అయితే ఆమె చనిపోవడం ఆమె తల్లిదండ్రులకి అనుమానాస్పదంగా అనిపించడంతో పోలీసులకి ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ఉత్రాను రెండుసార్లు పాము కరిచింది. మొదటిసారి కరిచినప్పుడు ఆమె బ్రతకగా, రెండో సారి చనిపోయింది. అయితే రెండుసార్లు పామే కావడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టగా దీనికి కారకుడు ఆమె భర్త సూరజ్ అని తేల్చారు.
సూరజ్‌కి వన్యప్రాణులు అంటే ఇష్టం.. అతని ఇంట్లో మేకలు, కుందేళ్లు, కుక్కలు మొదలైనవి ఉన్నాయి. తాజాగా ఓ పామును కూడా తీసుకొచ్చి తన కుటుంబం ముందు ప్రదర్శించాడు. అదే పాముతో తన భార్య ఉత్రాను కాటేసేలాగా చేశాడు. అయితే ఇలా ఎందుకు చేశాడని పోలీసులు విచారించగా... మరో అమ్మాయని పెళ్లి చేసుకోవాడానికి ఉత్రా అడ్డుగా ఉందని అందుకే ఈ పని చేసినట్లు సూరజ్ తెలిపాడు.
పక్కగా ఆధారాలు కూడా దొరకడంతో కోర్టు సూరజ్ ని దోషిగా తెలుస్తూ అక్టోబర్ 13న శిక్షను ఖరారు చేయనుంది.