Uttar Pradesh Crime: వెబ్‌సైట్ వ్యాపారం.. నగ్నంగా వీడియో కాల్స్ చేసి బ్లాక్‌మెయిల్..
Uttar Pradesh Crime: ఈరోజుల్లో సోషల్ మీడియా అనేది మంచికి ఉపయోగించిన వారికి మాత్రమే మంచి చేస్తుంది.;
video calls (tv5news.in)
Uttar Pradesh Crime: ఈరోజుల్లో సోషల్ మీడియా అనేది మంచికి ఉపయోగించిన వారికి మాత్రమే మంచి చేస్తుంది. లేకపోతే మోసం చేస్తుంది. చాలామంది కేటుగాళ్లు ఈ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఎన్నో రకాలుగా అమాయకులను మోసం చేస్తున్నారు. అందులో తెలీకుండా డబ్బులు సైబర్ క్రేమ్ నేరగాళ్లు ఉన్నారు. ఆన్‌లైన్ బిజినెస్ పేరుతో మోసాలు చేస్తున్నవారు ఉన్నారు. అయితే తాజాగా లక్నోలో ఓ జంట మాత్రం ఎవరూ ఊహించని విధంగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారు.
ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన సప్నాగౌతమ్, యోగేశ్ భార్యాభర్తలు. వారికి ఉన్నంతలో తృప్తిపడే గుణం లేదు. అత్యాశకు పోయి ఎలాగైనా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకున్నారు. అందుకే తమ సన్నిహితుడు ఒకడు నగ్నంగా వీడియో కాల్స్ చేసి ఆ తర్వాత వాటితో బ్లాక్‌మెయిల్ చేస్తే డబ్బులు సులువుగా వస్తాయని సలహా ఇచ్చాడు. ఈ ఐడియా నచ్చి వారు ఈ వ్యాపారం మొదలుపెట్టారు.
అలా నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడే ఏర్పాటు చేసే వెబ్‌సైట్‌లో సప్నాగౌతమ్, యోగేశ్ చేరారు. యోగేశ్ డబ్బున్న వివరాలు తెచ్చి వెబ్‌సైట్‌కు ఇచ్చేవారు. సప్నా.. వీడియో కాల్స్ ఎలా మాట్లాడాలి అని అమ్మాయిలకు ట్రైనింగ్ ఇస్తుండేది. అయితే ఈ వెబ్‌సైట్‌లో ఒక్కొక్క వీడియో కాల్‌కు రూ. 200 ఛార్జ్ చేసేవారు. అందులో వెబ్‌సైట్ సగం పోగా ఈ దంపతులకు మిగతా సగం వచ్చేది.
వెబ్‌సైట్‌లో పనిచేస్తూనే.. అక్కడి కస్టమర్ల వివరాలు సేకరించి విడిగా బిజినెస్ మొదలుపెట్టారు సప్నాగౌతమ్, యోగేశ్. సోషల్ మీడియాలో వీడియో కాల్స్ చేసి వారు నగ్నంగా మాట్లాడేలాగా చేసేవారు. అప్పుడు ఆ కాల్‌ను రికార్డ్ చేసి తర్వాత వారిని అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసేవారు. ఇలా ఎంతో మందిని మోసం చేసి గత రెండేళ్లుగా సుమారు రూ.22 కోట్లను వెనకేసుకున్నారు ఈ చోరీ దంపతులు.
వచ్చే డబ్బుతో అందమైన అమ్మాయిలను పనిలో పెట్టుకుని వారితో వీడియో కాల్స్ చేయించేవారు. వారికి నెలకు రూ. 25 వేలు జీతం కూడా ఇచ్చేవారు సప్నాగౌతమ్, యోగేశ్. నగ్నంగా వీడియో కాల్స్ చేయలేని అమ్మాయిలతో కేవలం మెసేజ్‌లు కూడా చేయించేవారు. దానికోసం వారికి రూ. 15 వేల జీతం ఇచ్చేవారు.
ఈ క్రమంలో ఓ కంపెనీకి చెందిన ఉద్యోగి రూ.80 లక్షలను కంపెనీ ఖాతా నుంచి ఈ దంపతులకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. దీని గురించి ఆ కంపెనీ యజమాని గుజరాత్‌లోని రాజ్‌కోట్ పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. దీంతో వీరి భాగోతం బయటపడింది. హీనీ ట్రాప్‌ను తలపిస్తున్న ఈ కేసులో భార్యాభర్తలు సహా మరో ముగ్గురు యువతులను అరెస్ట్ చేశారు పోలీసులు.