Wanaparthy Rural SI: మహిళతో ఎస్‌ఐ అక్రమ సంబంధం.. ఆమె భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో..

Wanaparthy Rural SI: ఓ వివాహితతో అక్రమసంబంధం పెట్టుకున్న SIని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుని చితకబాదారు.;

Update: 2021-11-26 11:30 GMT

Wanaparthy Rural SI (tv5news.in)

Wanaparthy Rural SI: ఓ వివాహితతో అక్రమసంబంధం పెట్టుకున్న SIని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుని చితకబాదిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోటలో జరిగింది. వనపర్తి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో SIగా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్‌ షఫియోద్దీన్‌.. కొత్తకోటకు చెందిన ఓ వివాహితతో రెండేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు.

అనుమానం వచ్చిన సదరు మహిళ భర్త. పలుసార్లు హెచ్చరించినా లాభం లేకపోయింది. దీంతో తానూ బెంగళూరు వెళ్తున్నట్లు చెప్పిన భర్త బ్యాగు సర్దుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

భర్త బయటకు వెళ్లగానే SIకి ఫోన్‌ చేసి ఇంటికి పిలిచింది. ఐతే వెంటనే తిరిగివచ్చిన భర్త వీరిద్దరిని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుని చితకబాది పోలీసులకు పట్టించారు. ఐతే దొరికిన వ్యక్తి SI కావడంతో రాజీ కుదిర్చేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News