Karnataka Crime: వివాహేతర సంబంధం.. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం..
Karnataka Crime: వివాహేతర సంబంధాలు ఈమధ్య చాలామంది జీవితాలలోనే చిచ్చురేపుతున్నాయి.;
Karnataka Crime (tv5news.in)
Karnataka Crime: వివాహేతర సంబంధాలు ఈమధ్య చాలామంది జీవితాలలోనే చిచ్చురేపుతున్నాయి. ఇంట్లో కట్టుకున్న జీవితభాగస్వామి ఉండగా మరొకరితో సంబంధం ఎంతోమంది ప్రాణాలను బలిదీసుకుంటోంది. తాజాగా అలాంటి మరో ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో భార్య. ఆ తర్వాత వారి మీద అనుమానం రాకుండా ఈ హత్యకు ఆత్యహత్య రంగును పులిమే ప్రయత్నం చేశారు.
కర్ణాటక రాష్ట్రంలోని డెంకణీకోట సమీపంలోని ఉణిసెట్టి గ్రామానికి చెందినవారు అయ్యప్ప, రూప దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. అయ్యప్ప టెంపో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రూపకు.. అయ్యప్ప సమీప బంధువు తంగమణితో వివాహేతర సంబంధం ఏర్పడింది. రూపకంటే తంగమణి చిన్నవాడైనా వారిద్దరూ ఆ విషయాన్ని లెక్కచేయలేదు.
మూడు నెలల క్రితం రూప, తంగమణి ఇళ్లల్లో నుండి వెళ్లిపోయారు. బంధువులు వీరు ఎక్కడున్నారో కనిపెట్టి తిరిగి ఇళ్లకు పంపించేశారు.భార్య ఇలా చేసిందనే బాధతో అయ్యప్ప రెండుసార్లు ఆత్యహత్యయత్నానికి పాల్పడ్డాడు. కానీ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదే అదునుగా తీసుకున్న రూప.. తంగమణితో కలిసి భర్తను చంపే ప్లాన్ వేసింది.
శుక్రవారం.. అయ్యప్ప ఇంట్లో నిద్రపోతున్న సమయంలో రూప, తంగమణి కలిసి తనను గొంతు నులిమి చంపేశారు. మరుసటి రోజు ఉదయం తన భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటూ నాటకం మొదలుపెట్టింది రూప. అక్కడికి చేరుకున్న పోలీసులకు రూప ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను, తంగమణిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. దీంతో వారే ఈ హత్య చేసినట్టు ఒప్పుకున్నారు.