హైటెక్ ఫ్లైఓవర్ పై ఘోర ప్రమాదం.. ప్రాణాలు తీసిన అతివేగం
యువతీ యువకులకు ఫ్లైఓవర్ ఎక్కితే చేతికి పగ్గాలు ఉండవు.. అతివేగంతో ప్రయాణిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.;
యువతీ యువకులకు ఫ్లైఓవర్ ఎక్కితే చేతికి పగ్గాలు ఉండవు.. అతివేగంతో ప్రయాణిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. హైటెక్ సిటీ ఫ్లై ఓవర్‌పై జరిగిన ప్రమాదంలో తన స్నేహితుడితో కలిసి వెళుతోన్న స్వీటీ పాండే (22) అనే యువతి మృతి చెందింది. బైక్ అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొనడంతో, యువతి స్నేహితుడు రియాన్ లూక్ ఫ్లైఓవర్ రోడ్డు మీద పడిపోయాడు. యువతి మాత్రం గాలిలో ఎగిరి ఫ్లైఓవర్ కింద రోడ్డుపై పడిపోయింది. దాంతో తలకు తీవ్రగాయాలయ్యాయి.
గమనించిన పాదచారులు పోలీసులకు సమాచారం అందించగా వారిని హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన స్వీటీ మృతి చెందగా, ల్యూక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్వీటీ నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.