Tamil Nadu: వృద్ధురాలిపై లైంగిక దాడి.. 70 ఏళ్ల వృద్ధురాలిపై 25 ఏళ్ల యువకుడు..

Tamil Nadu: ఈరోజుల్లో నెలల చిన్నారి దగ్గరి నుండి 70 ఏళ్ల ముసలావిడ వరకు ఎవరికీ సరైన రక్షణ లేదు అని కొందరి వాదన.;

Update: 2021-11-08 06:00 GMT

Tamil Nadu (tv5news.in)

Tamil Nadu: ఈరోజుల్లో నెలల చిన్నారి దగ్గరి నుండి 70 ఏళ్ల ముసలావిడ వరకు ఎవరికీ సరైన రక్షణ లేదు అని కొందరి వాదన. అది నిజమే అనిపించే దుర్ఘటనలు కూడా మనకు ఎన్నో ఎదురవుతున్నాయి. మాటలు కూడా రాని పసిపిల్ల దగ్గర నుండి కష్టంగా బతుకు సాగిస్తున్న వృద్ధురాలి వరకు ఎవరికీ రక్షణ లేదు. ఎవరిపై ఎప్పుడు లైంగిక దాడి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. తాజాగా ఇలాంటి ఒక ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

మద్యం మత్తులో 70 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి చేశాడు ఓ యువకుడు. వినడానికే కాస్త ఆశ్చర్యంగా, కాస్త బాధాకరంగా ఉన్న ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో సేలం జిల్లా కరుమందురైలో జరిగింది. వృద్ధ మహిళ ఆ ప్రాంతంలో మేకలుమేపుతూ జీవనం సాగిస్తోంది. శనివారం సాయంత్రం పొలంలో మేకలు మేపుతుండగా ఈ ఘటన జరిగింది.

అదే సమయంలో షణ్ముగం (25) మద్యం మత్తులో అక్కడి చేరుకున్నాడు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకునేలోపు షణ్ముగం అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటనపై స్థానికులు కరుమందురై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ ధనలక్ష్మి తెలిపారు.  

Tags:    

Similar News