LB Nagar: ఎల్బీనగర్‌లో దారుణం.. మద్యం తాగొద్దన్నందుకు దాడి చేసి చంపేశారు..
LB Nagar: హైదరాబాద్ ఎల్బీనగర్‌లో దారుణ ఘటన జరిగింది.;
LB Nagar: హైదరాబాద్ ఎల్బీనగర్‌లో దారుణ ఘటన జరిగింది. ఖాళీ ప్రదేశాల్లో మద్యం తాగొద్దన్న పాపానికి.. యువకులను ఇష్టం వచ్చినట్లు కొట్టారు మందుబాబులు. ఈ దాడిలో నర్సింహారెడ్డి అనే యువకుడు మృతిచెందగా.. నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. కేకే గార్డెన్ వెనక ఈ ఘటన జరిగింది.
మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఎల్బీనగర్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. అయితే ఖాళీ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న మందుబాబులు.. మద్యంతోపాటు గంజాయి కూడా తీసుకుని ఉంటారని భావిస్తున్నారు.