🔴LIVE: YS.Viveka Murder Case: CBI విచారణకు MP Avinash Reddy

వైఎస్.వివేకా హత్య కేసులో సిబిఐ దర్యాప్తు హాజరు నిమిత్తం MP Avinash Reddyపులివెందుల నుంచి గురువారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం సిబిఐ ఎదుట హాజరు కావటం పై ఆయన న్యాయవాదులతో ప్రత్యేక చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల, వేంపల్లి, లింగాల ,చక్రాయపేట మండలాల నుంచి వైసీపీ శ్రేణులు భారీగా హైదరాబాద్ కు తరలి వెళ్లారు. దీంతో సీబీఐ కార్యాలయం వద్ద ఆందోళన చేసే అవకాశం ఉండడంతో సీబీఐ కార్యాలయం ముందు పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. పులివెందుల నుంచి వచ్చిన కార్యకర్తలకు సీబీఐ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో అనుమతి నిషేధించారు పోలీసులు.
Live Updates
- 19 May 2023 5:16 PM IST
ఎంపీ అవినాష్ రెడ్డి ఎపిసోడ్ లో మరో ట్విస్ట్..
వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మీని అంబులెన్స్ ను కర్నూలు టౌన్ లోకి తీసుకెళ్లిన వైద్యులు,
కర్నూలు టౌన్ విశ్వభారతి హాస్పిటల్ లోకి ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి..
ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి ని చెక్ చేస్తున్న వైద్యులు...
గుండె సమస్యతో బాధపడుతున్న అవినాష్ తల్లి వైఎస్ లక్ష్మీ
విస్వభారతి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
- 19 May 2023 3:31 PM IST
హైదరాబాద్ వైపు బయలుదేరిన ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్.
అంబులెన్స్ లో ఎంపీ అవినాష్ రెడ్డి తో పాటు జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.
దాదాపు 40 వాహనాల కాన్వాయ్ తో హైదరాబాద్ బయలుదేరిన ఎంపీ అవినాష్ రెడ్డి
- 19 May 2023 3:05 PM IST
తాడిపత్రి సమీపంలోని చుక్కలూరు వద్ద తల్లి వైయస్ లక్ష్మిని పరామర్శించిన ఎంపీ అవినాష్ రెడ్డి.
పులివెందుల నుంచి వచ్చిన ప్రత్యేక అంబులెన్స్ లో తల్లిని పరామర్శించి, ఆమెతో మాట్లాడి,
ఆమె అంబులెన్స్ తో సహా హైదరాబాద్ బయలుదేరిన ఎంపీ అవినాష్ రెడ్డి
- 19 May 2023 2:42 PM IST
గుత్తి దగ్గర ఆగి ఉన్న ఆయన అనుచరుల వాహనాలతో సహా బయలుదేరిన ఎంపీ అవినాష్ రెడ్డి
గుత్తి నుంచి తాడిపత్రికి బయలుదేరిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్.
తాడిపత్రి మీదుగా పులివెందులకు వెళ్లి అవకాశం
- 19 May 2023 2:31 PM IST
కడప అనంతపురం సరిహద్దుల్లోని ప్రధాన చౌరస్తాల వద్దకు భారీగా చేరుకుంటున్న వైసీపీ శ్రేణులు
- 19 May 2023 2:28 PM IST
గుత్తి దగ్గర ఆగి ఉన్న ఆయన అనుచరుల వాహనాలతో సహా బయలుదేరిన ఎంపీ అవినాష్ రెడ్డి.
తాడిపత్రి మీదుగా పులివెందులకు వెళ్లే అవకాశం
- 19 May 2023 2:24 PM IST
హైదరాబాదు నుంచి కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి మీదుగా మీదుగా పులివెందుల చేరుకోనున్న అవినాష్ రెడ్డి..
డోన్ దాటిన అరగంటకు వాహనశ్రేణి నుంచి డైవర్ట్ అయిన అవినాష్ వాహనం..
- 19 May 2023 1:57 PM IST
అవినాశ్ ను అరెస్ట్ చేయండి
ఢిల్లీ సిబిఐ : విచారణ కు అవినాశ్ డుమ్మా కొట్టిన విషయాన్ని హెడ్ క్వార్టర్ కు తెలిపిన HYD CBI అధికారులు.
అవినాశ్ అరెస్ట్ కు హెడ్ క్వార్టర్స్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందినట్లు సమాచారం,
పారిపోతున్న అవినాష్ రెడ్డి ని వెంబడిస్తున్న సిబిఐ అధికారుల బృందాలు,తను ఆగే ప్రసక్తే లేదని, తన తల్లిని చూడాలని సిబిఐ అధికారులకు చెబుతున్న అవినాశ్ రెడ్డి.పులివెందులకు వెళ్లైనా అవినాశ్ ను అరెస్ట్ చేయాలని సిబిఐ అధికారులు నిశ్చయించుకున్నట్లు సమాచారం,
సిబిఐ అధికారులు ఫోన్‌చేసినా కారు ఆపకుండా వెళ్తున్న అవినాశ్ రెడ్డి.
- 19 May 2023 1:21 PM IST
కర్నూలు పుల్లూర్ టోల్ ప్లాజా క్రాస్ చేసి కడప జిల్లా వైపు వెళ్లిన అవినాష్ రెడ్డి కాన్వాయ్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com