APJ Abdul Kalam: ప్రేరణనిచ్చే అబ్ధుల్ కలాం మాటలు..

"సూర్యుడిలా ప్రకాశించాలని మీరు అనుకుంటే, ముందు సూర్యుడిలా కాలాలి".

Update: 2023-07-27 11:25 GMT

దేశవ్యాప్తంగా నేడు జులై 27న భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్ధల్ కలాం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ ఆయనని స్మరించుకుంటున్నారు. భారత అంతరిక్ష రంగం, రక్షణ రంగంలో విశేష సేవలందించిన కలాం మిస్సైల్ మ్యాన్‌గా ప్రసిద్ధి పొందాడు. దేశంలో శాస్త్ర సాంకేతికత, పాలిటిక్స్ రంగాల్లో తనదైన చెరగని ముద్ర వేశారు. 2015 సంవత్సరం జులై 27న IIM షిల్లాంగ్‌లో ఓ ఉపన్యాసం ఇస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు.

కలాం భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించాడు. ప్రజల అధ్యక్షుడిగా భారత దేశ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం నిలబెట్టుకున్నాడు.


1931 సంవత్సరం, అక్టోబర్ 15న ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన కలాం, రాష్ట్రపతి దాకా వచ్చిన తన జీవితం ఎందరికో ప్రేరణ, స్ఫూర్తినిస్తుంది. ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా DRDO, ISRO లో తను చేసిన కృషి వచ్చే తరాలకు బాటలు వేసింది. విద్యార్థులు, యువతని ఎక్కువగా ఇష్టపడే కలాం వివిధ సందర్భాల్లో వారితో మాట్లాడుతూ వారిలో స్ఫూర్తిని నింపేవాడు.

కలాం చెప్పిన మాటల్లో మచ్చుకు కొన్ని..

"ఆకాశం వైపు చూడండి. అది మనతోనే ఉంది. ఈ విశ్వమంతా మనతో స్నేహం చేస్తూ ఉత్తమంగా ప్రయత్నించే వారికోసం అన్నీ ఇస్తుంది"

"సూర్యుడిలా ప్రకాశించాలని మీరు అనుకుంటే, ముందు సూర్యుడిలా కాలాలి".

"నీ ప్రయత్నంలో నువ్వు విజయం సాధించాలంటే, లక్ష్యం వైపే నీ మనసు, దృష్టిని కేంద్రీకరించాలి."

"గొప్ప లక్ష్యం, కష్టపడేతత్వం, జ్ణానసముపార్జన, పట్టుదల వంటి 4 లక్షణాలు మీలో ఉంటే ఏదైనా సాధించవచ్చు"

"మొదటి విజయంతో మీరు పొంగిపోయి ప్రయత్నాన్ని ఆపవద్దు. తరువాతి ప్రయత్నంలో మీరు ఓడితే, మొదటి ప్రయత్నం అదృష్టంతోనే వచ్చిందనే వారు చాలా మంది ఉంటారు."

"మీరు అనుకున్నది సాధించేవరకు పోరాటం ఆపవద్దు. జీవితంలో లక్ష్యాన్ని నిర్ధేశించుకుని గొప్ప జీవితం పొందటానికి నిరంతరం నేర్చుకుంటూ ఉండటం, కష్టపడటం, పట్టుదల వంటివే ముఖ్యం."

"జీవితాశయం అనేది మీరు పడుకున్నపుడు వచ్చే కల కాదు, మిమ్మల్ని నిద్రపోకుండా చేసేది."





Tags:    

Similar News