కజకిస్తాన్‌లో అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం కూలి 42 మంది ప్రయాణికులు మృతి..

కజకిస్తాన్‌లో అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోవడంతో కనీసం 42 మంది ప్రయాణికులు మృతి చెందారు.;

Update: 2024-12-25 09:59 GMT

కజకిస్తాన్‌లో అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోవడంతో కనీసం 42 మంది ప్రయాణికులు మృతి చెందారు. విమానం అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందినదని,  రష్యాలోని చెచ్న్యాలోని బాకు నుండి గ్రోజ్నీకి ఎగురుతున్నదని, అయితే గ్రోజ్నీలో పొగమంచు కారణంగా దారి మళ్లించబడిందని రష్యన్ వార్తా సంస్థలు తెలిపాయి.

కజకిస్థాన్‌లోని అక్టౌ నగరానికి సమీపంలో బుధవారం విమానం కూలిపోవడంతో కనీసం 42 మంది మరణించినట్లు నివేదికలు వచ్చాయి. ఒక నివేదిక ప్రకారం, విమానంలో ఐదుగురు సిబ్బందితో సహా 67 మంది ప్రయాణిస్తున్నట్లు కజకిస్తాన్ అత్యవసర మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్ ప్రకటనలో ధృవీకరించింది.

ప్రాథమిక అంచనా ప్రకారం, వారిలో 22 మంది ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. విమానంలో అజర్‌బైజాన్‌కు చెందిన 37 మంది, రష్యాకు చెందిన 16 మంది, కజకిస్థాన్‌కు చెందిన ఆరుగురు, కిర్గిస్థాన్‌కు చెందిన ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు.

అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ నుండి ఏ విధమైన సమాచారం లేదు. విమానం నేలను తాకడంతో మంటలు చెలరేగడం, దట్టమైన నల్లటి పొగలు రావడంతో సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

Tags:    

Similar News